కమలాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి

కమలాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కమలాపూర్, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని కమలాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్, సర్పంచ్ పబ్బు సతీష్, శనిగరం సర్పంచ్ కొత్తపల్లి రాజు, సాంబరావు, కమలాపూర్ 13వ వార్డు సభ్యురాలు ఓసుకుల కీర్తన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు, దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా...