చాకలి ఐలమ్మ వర్ధంతి.. కరీంనగర్‌లో ఘన నివాళులు

చాకలి ఐలమ్మ వర్ధంతి.. కరీంనగర్‌లో ఘన నివాళులు కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఆమె విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సామాజిక అసమానతలు, దోపిడీ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని మేయర్ అన్నారు. ఆమె ఆశయాలు, పోరాట...