మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేటీఆర్, హరీశ్‌రావులపై కేసు

మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేటీఆర్, హరీశ్‌రావులపై కేసు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతలపై కేసు నమోదు హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే....