కొత్తపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

కొత్తపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నగరంలోని కొత్తపల్లి చెరువు వినాయక నిమజ్జన ప్రాంగణాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయిలో సందర్శించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపల్లి చెరువు గణేష్ నిమజ్జన కేంద్రం వద్ద చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, వైభవంగా జరిగేలా నగరపాలక...