ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణలో రాజీలేని పోలీసింగ్: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణలో రాజీలేని పోలీసింగ్: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి బ్యూరో / తెలంగాణ అడ్డా: భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు మరియు నేర నియంత్రణ చర్యలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దొంగతనాల నియంత్రణకు గస్తీ, నిఘా పెంచడంతో పాటు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని,...