అండర్-17 వాలీబాల్ జిల్లా స్థాయికి గ్రేస్ మిషన్ స్కూల్ విద్యార్థులు.

అండర్-17 వాలీబాల్ జిల్లా స్థాయికి గ్రేస్ మిషన్ స్కూల్ విద్యార్థులు. తెలంగాణ అడ్డా న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి). మణుగూరు:గ్రేస్ మిషన్ స్కూల్ విద్యార్థులు అండర్-17 వాలీబాల్ మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమా న్యం,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు,మణుగూరు మండలానికి మంచి పేరు తీసుకురా వాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి పుల్లారావు,ప్రిన్సిపాల్ మల్లేశ్వర్ రావు,సెక్రటరీ శామ్యూల్,పీఈటీ వెంకటేశ్వర్లు,వార్డెన్ వెంకటేశ్వర్లు, సురేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.