గణేష్ ఉత్సవాలపై పోలీసుల కీలక సూచనలు డీజేలకు పూర్తి నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గణేష్ ఉత్సవాలపై పోలీసుల కీలక సూచనలు డీజేలకు పూర్తి నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కమలాపూర్, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా): గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పలు కీలక సూచనలు, నిబంధనలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున మండప నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. డీజేలపై పూర్తి నిషేధం గణేష్ విగ్రహాల ఆగమన, నిమజ్జన కార్యక్రమాల సమయంలో డీజేలకు పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసులు...