ప్రమాదకరంగా మారిన నాలుగు కూడళ్ల రహదారి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ప్రమాదకరంగా మారిన నాలుగు కూడళ్ల రహదారి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి సిపిఎం పార్టీ డిమాండ్ బోయినిపల్లి, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి మెయిన్ రహదారిపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. బోయినిపల్లి నుంచి కొదురుపాక వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, అయితే రహదారిపై సరైన ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. నాలుగు కూడళ్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని...