యోగాలో ఒలింపిక్ స్థాయికి ఎదగాలి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అట్టహాసంగా రాష్ట్రస్థాయి యోగా పోటీలు ప్రారంభం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: భారత్‌లో 2036లో జరిగే ఒలింపిక్స్‌లో యోగాలో తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పోషకులు వూటుకూరి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్‌లో శుక్రవారం జరిగిన 13వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగా చాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారతీయ చరిత్రకు మూలాధారమైన యోగాతో సకల ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల్లోని విభిన్న క్రీడలకు ఆధారం యోగా అన్నారు. మానసిక రుగ్మతలను దూరం చేస్తూ మనిషిని సదా...