ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టేక్మాల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ద్వారా గుర్తింపు కల్పించినట్లుగానే, ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) కేటాయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని టేక్మాల్ మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. భూమి కలిగిన ప్రతి రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం...