పంచాయతీలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆదాయం జమ చేసే అవకాశం హర్షణీయం0

గ్రామపంచాయతీ నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేతకు కృతజ్ఞతలు పంచాయతీలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆదాయం జమ చేసే అవకాశం హర్షణీయం టేక్మాల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా తెలుగు దినపత్రిక): గ్రామపంచాయతీల నిధులపై విధించిన ఫ్రీజింగ్‌ను ఎత్తివేయడంతో పాటు, పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా నేరుగా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పించడం హర్షణీయమని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తలారి అవినాష్ కుమార్ అన్నారు. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం ద్వారా గ్రామపంచాయతీలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలోని సర్పంచుల తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ...