భక్తి పారవశ్యంలో భక్తులు.. ఘనంగా అంగీంపు కార్యక్రమం

ముగిసిన సప్త భజన సప్తాహం భక్తి పారవశ్యంలో భక్తులు.. ఘనంగా అంగీంపు కార్యక్రమం టేక్మాల్, దన్నారం, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా తెలుగు దినపత్రిక): దన్నారం గ్రామంలో గత మూడు రోజులుగా ఎంతో నిష్ఠతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన సప్త భజన సప్తాహం గురువారం ఘనంగా ముగిసింది. భగవన్నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆధ్యాత్మిక పురోగతితో పాటు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ భజన సప్తాహం భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. అంగీంపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, దివ్య నామస్మరణలు, సంకీర్తనలు నిర్వహించారు. భజనా బృంద సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. భజనల...