కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీయూసీ

కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలి 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి: ఏఐటీయూసీ బోయినపల్లి, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో సుతారి సంఘం సమావేశం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డుకు 2 శాతం నిధులు కేటాయించకపోగా, కార్మిక సంక్షేమ నిధిని సంవత్సరం టెండర్ పేరుతో కాంట్రాక్టుకు అప్పగించారని ఆరోపించారు. టెండర్ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడిచినా కార్మికుల పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 55 ఏళ్లు...