పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డికి మండల కాంగ్రెస్ పగ్గాలు?

టేక్మాల్ మండల కాంగ్రెస్‌కు నూతన శకం పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డికి మండల కాంగ్రెస్ పగ్గాలు? రేపో మాపో అధికారిక ప్రకటన టేక్మాల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా): టేక్మాల్ మండల కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుమారు 18 ఏళ్లుగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నిమ్మ రమేష్ స్థానంలో బర్థిపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పట్టోళ్ల విష్ణు వర్ధన్ రెడ్డిని నూతన మండల అధ్యక్షుడిగా నియమించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఏఐసీసీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచనలతో...