భావుసింగ్ నాయక్ తండాలో భూమి పూజ చేసిన సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం భావుసింగ్ నాయక్ తండాలో భూమి పూజ చేసిన సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేస్తాం తెలంగాణ అడ్డా, వీర్నపల్లి, సెప్టెంబర్ 11: వీర్నపల్లి మండల పరిధిలోని భావుసింగ్ నాయక్ తండాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్ లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న...