ఒడ్డ్యారాంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

ఒడ్డ్యారాంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గంగాధర, సెప్టెంబర్ 12, తెలంగాణ అడ్డా: గంగాధర మండలం ఒడ్డ్యారాం గ్రామ పరిధిలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు, ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు లేదా తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా కనిపించకుండా ఉన్నట్లయితే గంగాధర పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం కోసం: గంగాధర పోలీస్ స్టేషన్...