ఖేలో ఇండియాలో పతకాలు సాధించి తెలంగాణను నంబర్ వన్ గా నిలపాలి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ముగిసిన రాష్ట్రస్థాయి యోగా పోటీలు, ఓవరాల్ చాంపియన్‌గా కరీంనగర్
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో యోగా క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి. నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్‌లో జరిగిన 17వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్వతహాగా క్రీడాకారుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా పోటీలకు మన రాష్ట్రం ఆతిథ్యమిస్తోందన్నారు. యోగాతో పాటు మిగతా క్రీడల్లోనూ రాణించి తెలంగాణను...