అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించాలి హుజూరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన నాయకుల నిరాహార దీక్ష

హుజూరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: అర్హులైన దళిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దళిత బంధు క్రింద ఆర్థిక సహాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్సందర్శించి మాట్లాడారు. దళిత బంధు పథకం రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టంచేయాలని,హుజురాబాద్నియోజకవర్గంలో మొదటి విడతలో లబ్ధి పొందని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ. 12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను...