కొత్తపల్లి–జగిత్యాల హైవేపై సీసీ కెమెరాల ఏర్పాటు.. ప్రారంభించిన అదనపు డీసీపీ వెంకటరమణ రెడ్డి, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ప్రజల భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకమని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ వెంకటరమణ రెడ్డి అన్నారు. కొత్తపల్లి–జగిత్యాల హైవేపై ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ బి. కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రధాన రహదారులు, హైవేలపై ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు 24×7 నిఘా, వాహనాల కదలికల పర్యవేక్షణ, ప్రమాదాల...