దేశ సమైక్యతకు సెక్యులరిజం, ప్రజాస్వామ్యం రెండు కళ్లులాంటివి

ఆర్ఎస్ఎస్, బీజేపీ కబంధహస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి దేశ సమైక్యతకు సెక్యులరిజం, ప్రజాస్వామ్యం రెండు కళ్లులాంటివి సీతారాం ఏచూరి స్మారక సెమినార్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్‌బాబు వేములవాడ, సెప్టెంబర్ 12 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెడుతోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. స్కైలాబ్‌బాబు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కబంధహస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వేములవాడ సుభాష్‌నగర్‌లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం అగ్రనేత, అమరజీవి సీతారాం ఏచూరి రెండో...