రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

​వేములవాడ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: ​వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు. ​వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు...