ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు దమనకాండకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులని కూడా చూడకుండా ఇష్టారీతిన గొడ్డును బాదినట్లు చావబాదడం, కాళ్లు, చేతులు విరగ్గొట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.ఈ పోలీసుల దాడి తీవ్రతకు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడమే నిదర్శనమని తెలిపారు. తోటి నాయకులు వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని, లేదంటే పరిస్థితి ఎంత విషమంగా ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నిరసనలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న పోలీసులు,...