రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయల మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్
ఆదిలాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసిన మోసపూరిత ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటివరకు 16 మంది నుంచి సుమారు రూ. 13.31 కోట్ల వరకు అక్రమంగా సేకరించినట్లు విచారణలో తేలింది. ఈ మోసానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి నిందితుల వద్ద నుంచి ఒక ఫార్చునర్, ఒక థార్ వాహనంతో పాటు పలు ఖరీదైన ప్లాట్లు, స్థలాలకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను పోలీసులు...