సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకోవాలి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే పోరాటంలో పాల్గొనని మతోన్మాదులకు మాట్లాడే అర్హత లేదు సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా జరుపుకోవాలి సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయినపల్లి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక పోరాటమని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈ పోరాట చరిత్రను మతపరమైన కోణంలో వక్రీకరించడం సరికాదన్నారు. పోరాటంలో పాల్గొనని మతోన్మాద శక్తులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి...