రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతులు

పైప్‌లైన్ లీకేజీకి వెంటనే స్పందించిన సర్పంచ్ రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీకి మరమ్మతులు టేక్మాల్, సెప్టెంబర్ 13 (తెలంగాణ అడ్డా): టేక్మాల్ గ్రామంలోని రజక కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా నీరు బయటకు వచ్చి స్థానికులకు ఇబ్బందులు కలిగిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ తిమ్మిగారి సుధాకర్‌ వెంటనే స్పందించారు. జేసీబీ సహాయంతో మరమ్మతు పనులను వేగవంతం చేయించారు. పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా ప్రభుత్వం నిర్మించిన రజక కమ్యూనిటీ హాల్‌ కింది భాగం నుంచి నీరు బయటకు రావడంతో పాటు, సమీపంలోని ఇళ్లలోకి కూడా నీరు చేరినట్లు స్థానికులు తెలిపారు. విషయం సర్పంచ్‌ దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే పంచాయతీ...