రామగుండం కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసులు పరిష్కారం సీపీ అంబర్ కిషోర్ ఝా
ఝారామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026 సెప్టెంబర్ 12న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైందని, వివిధ విభాగాల్లో మొత్తం 5,261 కేసులు పరిష్కరించబడినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో 613 భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసులు, ప్రత్యేక చట్టాలకు సంబంధించిన36కసులుపరిష్కారమయ్యాయి. వీటితో పాటు 2,872 ఈ-చలాన్ కేసులు, మద్యం సేవించి వాహనం నడిపిన 1,740 కేసులు కలిపి మొత్తం 5,261 కేసులు పరిష్కారం అయినట్లు వెల్లడించారు. 125 సైబర్...