కోడిపందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి ఆరుగురి అరెస్ట్
రామగుండం ప్రతినిధి/ తెలంగాణ అడ్డా: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో అందిన విశ్వసనీయ సమాచారంతో రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది, కన్నెపల్లి ఎస్‌ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామశివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడి పందేలు నిర్వహిస్తూ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు, రూ. 2,100 నగదును స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు:రామ్‌టెంకి వినోద్ (25), తండ్రి: రామ్‌చందర్, వృత్తి: వ్యవసాయం, చంద్రపల్లి...