రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. జంట నగరాల్లో భారీ వాన, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఆదివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. తాజా వానలతో ఎల్నినో ఇబ్బందులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా శని, ఆది వారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. జంట నగరాల్లో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, సనత్నగర్, తార్నాక, ఉప్పల్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరింది....