హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: “అలెర్ట్‌గా ఉందాం.. అలెర్ట్‌గా ఉంచుదాం” హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను...