వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగాలి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పొలాస నరేందర్

వినాయకుడి ఆశీస్సులతో విఘ్నాలు తొలగాలి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పొలాస నరేందర్ తెలంగాణ అడ్డా ప్రతినిధి, వేములవాడ: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, మీడియా మిత్రులకు, అధికారులకు మాజీ సర్పంచ్, ధర్మకర్త సెస్ డైరెక్టర్ పొలాస నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజిస్తే సకల విఘ్నాలు తొలగి, జీవితంలో శుభాలు కలుగుతాయని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం, శాంతి నెలకొనాలని కోరుకున్నారు. ప్రజల ప్రతి కార్యం విజయవంతం కావాలని, వినాయక చవితి పండుగను అందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నరేందర్ ఆకాంక్షించారు. ప్రతి...