వెయ్యి రోజుల ప్రజాపాలన విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సమీక్ష సమావేశం
గోదావరిఖని ప్రతినిధి / తెలంగాణ అడ్డా: వెయ్యి రోజుల ప్రజాపాలనలో భాగంగా సోమవారం రామగుండం క్యాంప్ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ముఖ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజాపాలనలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు.ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, నాయకులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, డివిజన్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.