నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ వేములవాడ తెలంగాణ అడ్డా ప్రతినిధి సెప్టెంబర్ 14: తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని ప్రభావంతో కొనసాగుతున్న ద్రోణి కారణంగా నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే...