కరీంనగర్‌లో వినాయక మండపాల జోరు.. రామనగర్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్, ప్రజల ఇబ్బందులు

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కరీంనగర్‌లోని రామనగర్ నుంచి టెలిఫోన్ క్వార్టర్స్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై 'పెద్ద పోల్' ప్రాంతంలో వినాయక చవితి వేడుకల రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ రెండు భారీ వినాయక మండపాలను పక్కపక్కనే ఏర్పాటు చేయడం, పోటీపోటీగా ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణగా మారింది.ఈ రెండు ప్రతిష్టాత్మక వినాయక ప్రతిమలను కనులారా వీక్షించడానికి కరీంనగర్ నగర నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆ మార్గంలో తీవ్రమైన జనసమర్ధం ఏర్పడి రోడ్డు పూర్తిగా బ్లాక్ అవుతోంది. వాహనాలు ముందుకు కదలక పోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....