తండాలకు రోడ్డు లేక నరకయాతన ఐదేళ్లుగా హామీలే.. పనులు మాత్రం శూన్యం

తండాలకు రోడ్డు లేక నరకయాతన ఐదేళ్లుగా హామీలే.. పనులు మాత్రం శూన్యం వర్షం పడితే రాకపోకలకు తీవ్ర అంతరాయం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని తండాల ప్రజల డిమాండ్ వీర్నపల్లి, సెప్టెంబర్ 14 (తెలంగాణ అడ్డా): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామ పరిధిలోని కేలోత్ తండా, శంకర్ నాయక్ తండా, రెడ్డి నాయక్ తండాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు తండాల్లో సుమారు 120 కుటుంబాలకు చెందిన 346 మంది నివసిస్తున్నప్పటికీ, ఏళ్లుగా కొనసాగుతున్న రహదారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే రాకపోకలు బంద్ తండాలకు...