తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఆగా ఖాన్ ఫౌండేషన్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేయాలని ఆయన కోరారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌ విచ్చేసిన సందర్భంగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ, ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందని తెలిపారు. హైదరాబాద్‌తో...