‘గోపు’ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు.పాల్గొన్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి
ఎల్ఎండీ కాలనీ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో మంగళవారం గణనాథునికి పోరండ్ల ప్యాక్స్ చైర్మన్ గోపు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతోనిర్వహించుకోవాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సూచించారు. నిష్ఠ, నియమాలతో గణనాథుడిని ఆరాధించాలని, ప్రజాజీవితంలో ఉన్న నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను...