ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించని పక్షంలో హైదరాబాద్ దిగ్భంధం తప్పదు బీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో బీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట తప్పడం, మడమ తిప్పడం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని ఎద్దేవా చేశారు. సమస్యలు తీర్చాలని అడిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడని, ఉద్యోగులంటే మీ బానిసలు కాదని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ నెల 18 లోగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేదంటే హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వారి పోరాటానికి టీఆర్ఎస్ అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కవిత...