గిరిజనులను నట్టేట ముంచిన కాంగ్రెస్ సర్కార్: బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గూగులోతు సురేష్ నాయక్

వీర్నపల్లి / తెలంగాణ అడ్డా: ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూగులోతు సురేష్ నాయక్ నిప్పులు చెరిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేసీఆర్ హయాంలో గిరిజనులకు స్వర్ణయుగం తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో గిరిజనుల సంక్షేమానికి, అభ్యున్నతికి పెద్దపీట వేశారని కొనియాడారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 33 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి...