బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సత్యం పరామర్శ ఆర్థిక సహాయం అందజేత

బోయినపల్లి / తెలంగాణ అడ్డా: చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మంగళవారం బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తాళ్లపల్లి లత కుటుంబాన్ని, అలాగే పుట్టుకతో అంగవైకల్యంతో ఉన్న నలిమెల మహేందర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే సత్యం, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేసి, భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరమున్నా మరింత సహాయం అందజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో బోయినపల్లి మండల కాంగ్రెస్...