కరీంనగర్‌లో అత్యాధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖులు
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: తెలంగాణ ప్రభుత్వం మరియు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించడం జరిగింది. అధునాతన సాంకేతిక టెక్నాలజీతో రూపొందించిన ఈ భారీ కిచెన్‌ను వారు పరిశీలించారు. ఇడ్లీ, దోశ, పూరి, సాంబార్, బోండా తయారీ మిషన్లు, పాత్రలు క్లీన్ చేసే మిషన్లు, పాల కేంద్రం, ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్లను, వెజిటేబుల్ కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు, చట్నీ పౌడర్ తయారీ మిషన్లను ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించి,...