కరీంనగర్ అభివృద్ధికి పెద్దపీట పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కరీంనగర్ నగర రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నామని, ఇందులో భాగంగా నగరంలోని వివిధ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది.ప్రారంభించిన మరియు శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:42వ డివిజన్: భగత్ నగర్ (మమత థియేటర్, పొలాడి ఆనందరావు అపార్ట్మెంట్ గల్లీ)లో పూర్తయిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో రూ. 50 లక్షల UIDF నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.49వ డివిజన్: భాగ్యనగర్ (బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో) రూ. 50...