రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్

రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా: రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ఎస్‌ఐ శ్రీధర్, సీఐ రమేష్ మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీపీ, స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కను నాటారు.పరిసరాలు, రికార్డుల పరిశీలన:పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను క్రమబద్ధంగా ఉంచడంతో పాటు, వాటి వివరాలను సక్రమంగా...