కల్పిత నాయకుడు’ పుస్తకావిష్కరణను రద్దు చేయాలి: దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్
గంగాధర, తెలంగాణ అడ్డా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అసత్య, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ‘కల్పిత నాయకుడు’ పుస్తకావిష్కరణను తక్షణమే రద్దు చేయాలని దళిత సంఘాలు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం గంగాధర మండల శాఖ నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు గంగాధర ప్రవీణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవిత చరిత్ర, సిద్ధాంతాలు, దేశానికి ఆయన అందించిన సేవలను వక్రీకరించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు లేదా ప్రచురణలు ఉండకూడదన్నారు. పుస్తకంలోని అభ్యంతరకర అంశాలను అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే వాటిని వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు....