కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.అసెంబ్లీలో సంచలన ప్రకటన

హైదరాబాద్ / తెలంగాణ అడ్డా: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ కుటుంబ భూముల వివరాలను ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపించిన సీఎం.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ జరపాలని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 295 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందా లేదా తేల్చాలని స్పష్టం చేశారు. ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని నిలదీశారు....