కీసరలో ఏసీబీ అధికారుల దాడి రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ ఎస్ఐ, సీఐ అరెస్ట్

కీసర / తెలంగాణ అడ్డా: ​మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయించడానికి సీఐ ఆంజనేయులు ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేయగా, చివరకు రూ. 8,35,000/- లకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. సీఐ సూచన మేరకు మొదటి విడతగా రూ. 5 లక్షల లంచం సొమ్మును తీసుకుంటుండగా గురువారం అర్ధరాత్రి కీసర పెద్దమ్మ చెరువు (చెరువు గట్టు) వద్ద ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న...