భూ సర్వే, రీ-సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన సదస్సు. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్
వీర్నపల్లి / తెలంగాణ అడ్డా: మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ సర్వే, రీ-సర్వే ప్రక్రియపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.భూముల సరిహద్దు తగాదాలు, రికార్డుల డిజిటలైజేషన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న భూ సర్వే, రీ-సర్వే వల్ల రైతులకు చేకూరే ప్రయోజనాలను ఆయన ఈ సందర్భంగా సవివరంగా వివరించారు. రైతులు తమ భూములకు సంబంధించిన సరైన పత్రాలను సర్వే అధికారులకు సమర్పించి, ఈ సర్వే ప్రక్రియను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ కోరారు. ఈ ఆధునిక సర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని...