బంజరు గ్రామంలో విజయవంతంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
స్థానిక ప్రతినిధి / తెలంగాణ అడ్డా: కరీంనగర్ జిల్లాలోని బంజరు గ్రామంలో కాత్యాయని కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బట్టు కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బట్టు కృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కంటి చూపు సమస్యలతో బాధపడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని, అందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ శిబిరంలో...