యూపీఐ లావాదేవీలపై ఛార్జీల మోత రోజువారీ రూ. 50 కోట్లు, సంవత్సరానికి రూ. 4 లక్షల కోట్ల ఆదాయం! చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం రూ. 50,000 వరకు మినహాయింపు ఇవ్వాలని ప్రజల డిమాండ్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ (UPI) సేవలు విప్లవాత్మక మార్పులు సృష్టించాయి. కోట్లాది మంది ప్రజలు రోజువారీ లావాదేవీల కోసం దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దీని వెనుక చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం మరియు ప్రభుత్వ ఆదాయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.తాజా గణాంకాల ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో 24.51 బిలియన్లకు (దాదాపు 2,451 కోట్లు) చేరగా, వీటికి సంబంధించిన మొత్తం విలువ సుమారు రూ. 29.82 లక్షల కోట్లుగా (29,82,000 కోట్లు) నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 79 కోట్ల లావాదేవీలు...