మంకమ్మతోట మున్నూరు కాపు సంఘ భవనంలో బోరు, మోటార్ బిగింపు.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన సంఘం అధ్యక్షుడు ముప్పిడి సునీల్ కుమార్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ నగరంలోని మంకమ్మతోట మున్నూరు కాపు సంఘ భవనంలో నీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ప్రత్యేక నిధులతో సంఘ భవనంలో నూతనంగా బోరు వేయించి, అనంతరం మోటార్‌ను కూడా విజయవంతంగా బిగించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముందుండి ఎంతగానో కృషి చేసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ బండి ప్రశాంత్ దీపక్ గారికి మంకమ్మతోట మున్నూరు కాపు సంఘం తరఫున మరియు వ్యక్తిగతంగా హృదయపూర్వక ధన్యవాదాలు...