తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ప్రజాపాలనకు ప్రేరణ - డా. కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో గౌరవ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఘనంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరిగిన చారిత్రక పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, సమగ్రాభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని డా. కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజలకు పూర్తిగా...